1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (21:09 IST)

శేషాచలం అడవుల్లో ఎగిసి పడుతున్న మంటలు

శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు కపిల తీర్థం పైనున్న అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. మెల్లమెల్లగా మంటలు చెలరేగి దట్టంగా అల్లుకున్నాయి. వేడిగాలులు వస్తుండడంతో మంటలు మరింతగా చెలరేగాయి.
 
అయితే మంటలు వ్యాపిస్తున్న ప్రాంతానికి వెళ్లే వీలు లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందితో పాటు టిటిడి అధికారులు చేతులెత్తేశారు. వేసవి కాలం కావడంతో అడవుల్లోని రాళ్ళురాళ్ళు రాసుకుని ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించినట్లు ఫైర్‌ సిబ్బంది భావిస్తున్నారు. 
 
వాతావరణం చల్లబడిన తరువాత మంటలు దానికదే ఆరిపోతే ప్రమాదం తప్పినట్లే. లేకుంటే అటవీ ప్రాంతం మొత్తం మంటలు వ్యాపిస్తే మూగ జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లేనని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.