మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 11 మే 2016 (16:57 IST)

తిరుపతి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

తిరుపతిలోని శ్రీకోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య పుష్పయాగ ఘట్టం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని వేదపండితులు జరిపారు. అంతకుముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మంగళవారం ఆలయంలో అంకురార్పణ జరిపారు. మేధినిపూజ, మృత్సంగ్రహనం, సేనాధిపతి ఉత్సవం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. 
 
కోదండరామాలయంలో ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలలోగానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార, అనధికారుల వల్ల భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పగాయాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయన్నది అర్చకుల నమ్మకం.