శ్రీకాళహస్తి రాజగోపురం ప్రారంభం...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. ఇది చిత్తూరు జిల్లాలో వెలసివుంది. ఈ ఆలయ రాజగోపురం ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా ఇటీవల జరిగింది. రాజగోపురం ప్రారంభోత్సవం సంధర్భంగా మహా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. ఇది చిత్తూరు జిల్లాలో వెలసివుంది. ఈ ఆలయ రాజగోపురం ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా ఇటీవల జరిగింది. రాజగోపురం ప్రారంభోత్సవం సంధర్భంగా మహాకుంభాభిషేకాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం వైభవోపేతంగా నిర్వహించింది. ఆరు సంవత్సరాల పాటు నవయుగ కంపెనీ రాజగోపురాన్ని పునర్నిర్మించింది. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు కంచిమఠానికి చెందిన విజయేంద్ర సరస్వతిలు మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు.
ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు రాజగోపురాన్ని నిర్మించారు. ఆరు సంవత్సరాల క్రితం రాజగోపురం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయింది. అయితే ఆ తరువాత రాజగోపురాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. 2010 సంవత్సరంలో అప్పటి సీఎం రోశయ్య రాజగోపురానికి శంఖుస్థాపన చేశారు. 48 కోట్ల రూపాయలతో రాజగోపురాన్ని పూర్తి చేశారు. అయితే వారం రోజులుగా విశ్వశాంతి యజ్ఞాన్ని నిర్వహించిన దేవస్థానం అధికారులు ఫిబ్రవరి 1వ తేదీన రాజగోపురాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఫిబ్రవరి 2వతేదీ బాగుంటుందని, గడియాలు కూడా బాగా కలిసొస్తాయని కంచిమఠాధిపతి, పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతిలు సూచించారు. దీంతో గురువారం రాజగోపురాన్ని ప్రారంభించారు. ప్రారంభానికి సూచకంగా మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు మహాకుంభాభిషేకానికి హాజరయ్యారు.