శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (11:30 IST)

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

Ram Lalla
Ram Lalla
అయోధ్యలోని రామ్ లల్లా మల్బరీ సిల్క్ దుస్తులతో మెరిసిపోతున్నారు. అయోధ్య రామయ్య  మల్బరీ సిల్క్‌తో తయారు చేయబడిన దుస్తులతో ముస్తాబయ్యారు. ఉత్తరాఖండ్ సాంప్రదాయ ఐపాన్ కళతో అలంకరించబడింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర ప్రజలకు ఇది "ఆశీర్వాద క్షణం" అని అభివర్ణించారు. 
 
అయోధ్యలోని రామ్ లల్లా దివ్య విగ్రహంపై ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ ఐపాన్ కళతో అలంకరించబడిన శుభవస్త్రం వుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు రామయ్యపై వున్న అపారమైన విశ్వాసాన్ని సూచిస్తుంది. దీనిని ఉత్తరాఖండ్‌లోని నైపుణ్యం కలిగిన కళాకారులు తయారు చేశారు.
 
ఉత్తరాఖండ్‌లోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ కళలు కొత్త గుర్తింపును పొందడమే కాకుండా, భవిష్యత్ తరాలు కూడా స్ఫూర్తిని పొందుతున్నాయి. ఐపాన్ అనేది ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతానికి చెందిన ఒక జానపద కళ.