శ్రీవారి సన్నిధిలో సంప్రదాయ భోజనం నిలిపివేత : తితిదే
ఇటీవల శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
సంప్రదాయ భోజనంపై ప్రశంసలు కురిసినప్పటికీ, డబ్బులు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన వైవీ సుబ్బారెడ్డి సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ విషయమై అధికారులతో చర్చించినట్టు పేర్కొన్నారు. పాలకమండలి లేనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్వామి వారి ప్రసాదంగానే భోజనం అందించాలని, డబ్బులు వసూలు చేయకూడదని నిర్ణయించామని వైవీ తెలిపారు.