శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (15:57 IST)

భక్తులకు షాకిచ్చిన తితిదే : అలాంటి భక్తులు కొండపైకి రావొద్దంటూ... (Video)

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తేరుకోలేని షాకిచ్చింది. సర్వదర్శన టిక్కెట్లను గణనీయంగా తగ్గించింది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపించింది. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రభావం దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలపై కూడా పడుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టిక్కెట్లను తగ్గించింది.
 
ఇదే అంశంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలపై కూడా కరోనా ఎఫెక్ట్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని 15 వేలకు పరిమితం చేస్తున్నామని చెప్పారు. 
 
ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఇప్పటికే విడుదల చేశామని... టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే అంశంపై... అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి తిరుమలకు రావాలని కోరారు.