శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (19:29 IST)

పేడ, బంకమట్టితో తిరుమలకు చేరుకున్న కారు.. ఆ కారులో?

కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి శ్రీవారి దర్శనార్థం సొంత కారులో తిరుమలకు చేరుకున్నారు. కారు మొత్తానికి పేడ, బంకమట్టి పట్టించారు. ఎండ నుంచి ఉపశమనం కోసం ఇలా చేశారని డ్రైవరు చెప్పారు. 
 
నందకం కార్ల పార్కింగ్‌ వద్ద ఉంచిన వాహనాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా కారులోనే ఏసీ ఉంటుంది చల్లదనాన్ని ఇస్తుంది. కానీ కర్ణాటకకు చెందిన భక్తులు మాత్రం కారు నుంచి వచ్చే ఏసీ చల్లదనం కన్నా పాతకాలం నాటి మట్టి ఎంతో శ్రేయస్కరం అని భావించాడు.
 
దీంతో డ్రైవర్ చేత పేడ, బంకమట్టిని కారుకు పూయించాడు. నందకం అతిథి గృహం వద్ద పార్కు చేసిన కారును ఆసక్తిగా  భక్తులు తిలకించారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా కార్లను తిరుపతికి తీసుకురాలేదని భక్తులు అంటున్నారు.