మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (17:54 IST)

మధుమేహానికి టమోటా జ్యూస్‌తో అడ్డుకట్ట... ఎలా చేయాలి..?

టమోటా మధుమేహానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. టమోటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఈ వల్ల కొవ్వు అదుపులో ఉంటుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది.
 
టమోటా జ్యూస్ ఎలా చేయాలంటే..
టమాటా, దోసకాయ, పుదీనా, వెల్లుల్లి, పెరుగు, ఉప్పుని తీసుకోండి. వీటన్నింటినీ మిక్స్ చేసి గాజు గ్లాసులో ఉంచుకోండి. కావాలంటే ఈ పానీయానికి తీపి పదార్థాలు కలుపుకోవచ్చు. ఇలా తయారైన రసాన్ని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
టమోటాను డైట్‌లో చేర్చుకుంటే.. క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఒక్క పచ్చి టమోటాను తింటే.. చూపు బాగా కనబడుతుంది.