శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (18:39 IST)

మధుమేహాన్ని నియంత్రించే పచ్చి బఠాణీలు.. ఎలాగంటే?

పచ్చి బఠాణీల్లో ధాతువులు పుష్కలంగా వున్నాయి. బఠానీలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠాణీ చక్కటి ఆహారం. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఇది తగ్గిస్తుంది. ఎముకలకు బలం చేకూర్చుతుంది. ఆర్థరైటిస్, ఆస్టియోపారోసిన్లను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనుక పచ్చిబఠానీలు దొరికే సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప 
 
పచ్చి బఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఎ,సి,కె లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠాణీల్లోనీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను నిరోధిస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషంట్స్‌కు చాలా ముఖ్యం ఇందులో కార్బోహైడ్రేట్స్, నేచురల్ షుగర్ లెవల్స్ పుష్కలంగా ఉంటుంది.
 
అంతేకాదు.. పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది. పచ్చిబఠానీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బఠాణీలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధకులు తెలిపారు. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కనుక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారంగా చెప్పవచ్చు.