336 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మంగళవారం కూడా లాభాలబాటలో ముగిసింది. ఈ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 336 పాయింట్ల మేరకు లాభపడి 25367 వద్ద ముగియగా, నిఫ్టీ 87 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7581 వద్ద ఆగింది. గత నాలుగు రోజుల వరుసగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం మాత్రం ఆయిల్, గ్యాస్, ఆటో, రియాల్టీ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
ఈ ట్రేడింగ్‌లో జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, హెచ్‌పీసీఎల్, జెట్ ఎయిర్ ఇండియా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, ఎంసీఎక్స్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, మ్యారీకో, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.