శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (16:49 IST)

అబ్బే.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వద్దు.. వెనక్కి తగ్గుతున్న ఇన్వెస్టర్లు.. రూ.7కోట్లు ఆవిరి

Stock Market
భారత స్టాక్ మార్కెట్లకు కష్టకాలం తప్పట్లేదు. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అంతర్జాతీయ పరిణామాలు స్టాక్‌మార్కెట్‌ను కలవర పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి వివిధ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు స్టాక్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో భారత మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 
 
ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బ్లాక్‌మండే ఎఫెక్ట్‌తో మార్కట్‌ ఆరంభమైన అరగంటలోనే సెన్సెక్స్‌ 53 వేల దిగువకు పడిపోగా నిఫ్టీ 16వేల కిందకు పడిపోయింది.  
 
ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు.
 
ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్‌మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.7కోట్లు ఆవిరి అయ్యాయి.