రియోలో ''గే'' లవర్ ప్రపోజ్.. నన్ను పెళ్ళి చేసుకుంటావా? అంటూ కిస్.. ఆపై రింగులు...
రియో ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో ఆటగాళ్లు ప్రతిభతో పతకాల పంట పండిస్తుంటే.. మరోవైపు విలేజ్‌కు బయట ప్రాంతంలో దోపిడి, వ్యభిచారం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఒలింపిక్ మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది
రియో ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో ఆటగాళ్లు ప్రతిభతో పతకాల పంట పండిస్తుంటే.. మరోవైపు విలేజ్‌కు బయట ప్రాంతంలో దోపిడి, వ్యభిచారం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఒలింపిక్ మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే..? ఓ ''గే'' లవర్ తన ''గే'' లవర్‌కు క్రీడా మైదానంలో ప్రపోజ్ చేసింది. బ్రెజిల్‌కు చెందిన మహిళా రగ్బీ క్రీడాకారిణి ఇసాడోరా సెరుల్లో (25), మర్జోరీ ఇనియా అనే మహిళను రెండేళ్ల పాటు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రగ్బీ పోటీల్లో బ్రెజిల్ మహిళా జట్టు పాల్గొంది.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇసోడోరా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ వేలాది మంది సమక్షంలో మర్జోరీ ఇనియా ప్రపోజ్ చేసింది. చేతిలో మైకుతో ఇసోడోరా వద్దకు వెళ్ళిన ఇనియా.. మోకాలిపై నిల్చుని ప్రపోజ్ చేసింది.
వెంటనే ఇనియా ప్రపోజల్‌ను అంగీకరించిన ఇసోడోరా.. ఆమెను కౌగిలించుకుని.. ముద్దెట్టుకుంది. ఆపై ఇద్దరూ అక్కడే రింగులు కూడా మార్చేసుకున్నారు. ఇకపోతే.. ఇలాంటి ఘటన ఒలింపిక్ క్రీడా మైదానంలో జరగడం ఇదే తొలిసారి.