గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (20:08 IST)

బాక్సర్ ల‌వ్లీనాకు డీఎస్పీ పోస్టు ఆఫర్

బాక్సర్ ల‌వ్లీనా బోర్గోహైన్‍కు డీఎస్పీ పోస్ట్ ఆఫ‌ర్ చేశారు అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ‌. అంతేకాదు గౌహ‌తిలోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన లవ్లీనా సొంతూరు గోలాఘాట్‌లో ఆమె పేరు మీద స్టేడియం క‌డ‌తామ‌ని చెప్పారు. ఆమె కోచ్‌కు రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌న్నారు. 
 
ఒలింపిక్స్‌లో పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా సెమీఫైన‌ల్ వ‌ర‌కూ వెళ్లిన ల‌వ్లీనా.. అందులో ఓడ‌టంతో బ్రాంజ్ మెడ‌ల్‌తో స‌రిపెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో విజేంద‌ర్‌, మేరీకోమ్ త‌ర్వాత మెడ‌ల్ గెలిచిన మూడో బాక్స‌ర్‌గా లవ్లీనా నిలిచింది.