భారత షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ సస్పెండ్.. మైనర్‌పై లైంగిక వేధింపులు
Ankush Bhardwaj
ఫరీదాబాద్‌లో భరద్వాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు ఎన్‌ఆర్‌ఏఐ ధృవీకరించింది. తీవ్రమైన లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 351(2) కింద అతనిపై కేసు నమోదు చేశారు.
ఇంకా ఎన్‌ఆర్‌ఏఐ అతన్ని సస్పెండ్ చేసింది. ఇంకా అతనికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా తెలిపారు. నైతిక కారణాల దృష్ట్యా అతన్ని సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు, అతను ఏ కోచింగ్ కార్యకలాపాలలోనూ పాల్గొనడు.. అని ఆయన అన్నారు.
2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎన్‌ఆర్‌ఏఐ సిఫార్సు చేసి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించిన 37 మంది సభ్యుల కోచింగ్ సిబ్బందిలో భరద్వాజ్ కూడా ఒకరు. గత నెలలో కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌ల సమయంలో ఈ సంఘటన జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
