బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 జనవరి 2024 (19:33 IST)

తొలిసారిగా టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌ను జ్యూరిచ్‌లో కలిసిన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా

Roger Federer, Neeraj Chopra
స్విస్ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌ను భారత ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా జ్యూరిచ్‌లో కలిశారు. తమ దేశాలను గర్వపడేలా చేసిన ఇద్దరు మహోన్నత క్రీడాకారులు ఒక చోట కలవటాన్ని అతి అరుదుగా మాత్రమే మీరు చూడగలరు. ఈ అరుదైన దృశ్యాన్ని స్విట్జర్లాండ్ టూరిజం సాధ్యం చేసింది. జ్యూరిచ్‌లోని లా రిజర్వ్ ఈడెన్ ఔ లాక్‌లో సాధారణ, ఉత్సాహపూరిత సంభాషణ కోసం వివిధ క్రీడా రంగాలకు చెందిన ఈ రెండు గొప్ప చిహ్నాలు- టెన్నిస్ మరియు జావెలిన్ త్రోను ఒకే వేదిక పైకి తీసుకురావటం ద్వారా క్రీడా ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 
 
టెన్నిస్ కోర్టులో మరియు వెలుపల పరాక్రమానికి పేరుగాంచిన ఫెదరర్, స్విట్జర్లాండ్ టూరిజం యొక్క ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా ఉన్న నీరజ్‌ను అతని స్వదేశానికి సాదరంగా స్వాగతించాడు. “జ్యూరిచ్‌లో రోజర్ ఫెదరర్‌ను కలవడం తన కల సాకారమైనదనిపిస్తుంది. అతని నైపుణ్యం, నిజమైన క్రీడాస్ఫూర్తి మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే అతని సామర్థ్యాన్ని తాను అభిమానిస్తుంటాను. అయితే, ఈ రోజు, అతనితో మైదానంలో మరియు వెలుపల మా అభిరుచులు, జీవిత అనుభవాల గురించి చేసిన సంభాషణలతో మేము అద్భుతమైన సమయాన్ని గడిపాము,” అని నీరజ్ చోప్రా అన్నారు.
 
నీరజ్‌ని కలుసుకోవడంపై రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ “నీరజ్ తన పట్టుదల మరియు సంకల్పం ద్వారా వ్యక్తిగతంగానే కాకుండా అతని దేశం కోసం ఎంత సాధించాడో చూసి నేను ఆశ్చర్యపోయాను. అతనిని ఇక్కడ జ్యూరిచ్‌లో కలవడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. "తమ బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్న ఈ ఇద్దరు గొప్ప క్రీడా దిగ్గజాల మధ్య సమావేశాన్ని నిర్వహించడం తమకు చాలా సంతోషంగా ఉంది" అని డిప్యూటీ డైరెక్టర్&మార్కెటింగ్ హెడ్ - ఇండియా, రితూ శర్మ అన్నారు.