గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (16:12 IST)

పెరూలో విషాదం... పిడుగుపాటుకు ఫుట్‌బాల్ క్రీడాకారుడి మృతి (Video)

Lightning strike
లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన పెరూలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో పిడుగుపడటంతో ఓ ఫుట్‌బాల్ ఆటగాడితో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగుపడటాన్ని ప్రత్యక్షంగా చూసినవారంతా షాక్‌కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలోని ఓ సాకర్ స్టేడియంలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
అయితే, మ్యాచ్ మధ్యలో వర్షం పడటంతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేవేశాడు. ఆటగాళ్లు తమ డగౌట్‌కు వెళుతుండగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో ఓ ఆటగాడు, మ్యాచ్ రిఫరీ కుప్పకూలిపోయాడు. రిఫరీకి తీవ్రగాయాలు కాగా, ఆటగాడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. పిడుగు నేరుగా పైనపడటంతో ఆ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.