గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:53 IST)

మను భాకర్, సౌరభ్ చౌదరి అదుర్స్.. పసిడిని గెలుచుకునేశారు...

దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రీడాకారులు సౌరభ్ చౌదరి, మను భాకర్.. పసిడి పతకాన్ని సాధించారు. పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత సౌరభ్, మను భాకర్ ద్వయం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.


ఫైనల్లో 778 స్కోరుతో 5.7 మార్జిన్‌తో భారత ద్వయం గెలుపును నమోదు చేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా, కొరియా, ఉక్రెయిన్ షూటర్ల నుంచి భారత్ గట్టిపోటీని ఎదుర్కొంది. 
 
అయితే ఫైనల్లో సౌరభ్ చౌదరి, మను భాకర్ ధీటుగా రాణించి పసిడిని గెలుచుకున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019లో భారత్ ఇప్పటివరకు మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది.

అలాగే రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి రోజు ఆటలో అపూర్వి చందెలియా 10 మీటర్ల ఎయిర్ రిఫైల్ విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది.