శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (10:42 IST)

నిషేధం తర్వాత తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన మరియా షరపోవా

డోపింగ్ టెస్టులో పట్టుబడి 15 నెలల పాటు నిషేధానికి గురైన మరియా షరపోవా.. నిషేధం అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగిన ఆమె... తనదైన శైలిలో ప్రత్యర్థిపై విరుచుకుపడింది

డోపింగ్ టెస్టులో పట్టుబడి 15 నెలల పాటు నిషేధానికి గురైన మరియా షరపోవా.. నిషేధం అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది.  యూఎస్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగిన ఆమె... తనదైన శైలిలో ప్రత్యర్థిపై విరుచుకుపడింది.

తొలి మ్యాచ్ లోనే రెండో సీడ్ సిమోనా హలెప్‌ను 6-4, 4-6, 6-3 తేడాతో మట్టికరిపించింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఆద్యంత మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. 
 
తీవ్ర ఒత్తిడికి లోనైన హలెప్ మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. దీంతో మరియా షరపోవా గెలుపును నమోదు చేసుకుంది. మ్యాచ్ అనంతరం షరపోవా మాట్లాడుతూ, గెలవాలనే పట్టుదలతోనే బరిలోకి దిగానని... అంచనాలకు మించి రాణించాననే ఆనందం లభించిందని తెలిపింది. డోపింగ్ టెస్టులో పట్టుబడిన షరపోవా 15 నెలల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.