శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (09:34 IST)

ఫ్రెంచ్ ఓపెన్.. రికార్డ్ సృష్టించిన నోవాక్ జకోవిచ్..

Novak Djokovic
Novak Djokovic
టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్ళలో స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఒకడు. తాజాగా నోవాక్ జకోవిచ్  ఫ్రెంచ్ ఓపెన్‌లో తన చారిత్రాత్మక 23వ మేజర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్‌లో క్యాస్పర్ రూడ్‌ను ఓడించి, పారిసియన్ క్లేపై టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. 
 
జొకోవిచ్ మొదటి సెట్‌లో 1-4 లోటును అధిగమించి, టై-బ్రేక్‌లో దానిని గెలుచుకున్నాడు. అంతేగాకుండా తరువాతి రెండు సెట్‌లను కూడా సునాయాసంగా గెలుచుకున్నాడు, 7–6(1), 6–3, 7–5తో విజయం సాధించాడు. ఈ విజయంతో, జొకోవిచ్ రాఫెల్ నాదల్ రికార్డును అధిగమించాడు 
 
ఫలితంగా టైటిల్ గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నోవాక్ జకోవిచ్ నిలిచాడు అంతేగాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.