గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (22:07 IST)

రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డ్.. ఏంటది?

Rohit sharma
Rohit sharma
కాసుల వర్షం కురిపించే ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ తన ఖాతాలో చెత్తరికార్డును వేసుకున్నాడు. ముంబై కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఐపీఎల్-2023 సీజన్‌ చేపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడో బంతికి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ల్యాప్ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే.. బ్యాక్ వర్డ్ పాయింట్‌లో వున్న జడేజా చేతికి చిక్కాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.