1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (10:48 IST)

'ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది'... పుల్లెల గోపీచంద్

ఏదోక రోజు స్పెయిన్ క్రీడాకారిణి కరోలిన్ మరిన్‌ను పీవీ సింధు ఏదో ఒక రోజున ఓడిస్తుందని కోచ్ పుల్లెల గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు

ఏదోక రోజు స్పెయిన్ క్రీడాకారిణి కరోలిన్ మరిన్‌ను పీవీ సింధు ఏదో ఒక రోజున ఓడిస్తుందని కోచ్ పుల్లెల గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయం తర్వాత గోపీచంద్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పీవీ సింధు అద్భుతంగా ఆడుతోందని, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఆటతీరు తాను గర్వించేలా ఉందన్నాడు. 
 
కోర్టులో ఆమె కదిలిన తీరు, పోరాట పటిమ నిరుపమానమని కొనియాడాడు. తమ కష్టానికి ఫలితం దక్కిందని, సింధు అత్యుత్తమంగా ఆడిందన్నాడు. తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందని, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. సింధు మళ్లీ పుంజుకుంటుందని, ఏదోక రోజు మరిన్‌ను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండో గేమ్ మొదట్లో సింధు తడబడిందని, మూడో గేమ్ కొన్ని అనవసర తప్పిదాల వల్ల సింధు మ్యాచ్ కోల్పోయిందని విశ్లేషించాడు.