శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:34 IST)

సానియా మీర్జాకు అరుదైన ఘనత.. ఇది 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అరుదైన ఘనత సాధించింది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. సానియా మీర్జాతో పాటు ఇండోనేషియాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో కూడా ఈ అవార్డుకు  నామినేట్ అయింది.
 
సానియా ఇటీవల నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లోకి తిరిగి వచ్చింది. తన 18 నెలల కుమారుడు ఇజాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి ఆడి తొలిసారి ప్లే-ఆఫ్స్‌కు భారత్ అర్హత సాధించేందుకు సాయం చేసింది. 
 
ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. 2003లో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ కోర్టులో ఆడుగుపెట్టడం తనకు గర్వకారణం అంటూ చెప్పింది. ఇది 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం అంటూ గుర్తు చేసుకుంది. భారత టెన్నిస్‌లో విజయాలకు దోహదపడినందుకు గర్వంగా ఉందని సానియా వెల్లడించింది. 
 
గత నెలలో జరిగిన ఆసియా/ఓషియానియా టోర్నమెంట్‌లో ఫెడ్ కప్ ఫలితం తన క్రీడా జీవితంలోని గొప్ప విజయాల్లో ఒకటి. ఫెడ్‌కప్ హార్ట్ అవార్డ్స్ సెలక్షన్ ప్యానల్ తనను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను'' అని 33 ఏళ్ల సానియా పేర్కొంది.