1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
  4. Sania Mirza second marriage rumours surface reports

భారత్ టెన్నిస్ స్టార్.. సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?

Sania Mirza
Sania Mirza
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె విదేశీయుడిని లేదా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. 
 
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత, సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దుబాయ్ మరియు హైదరాబాద్‌లలోంటూ జీవిస్తున్నారు. 
 
ఆమె తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికి, కుమారుడి బాధ్యతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ, ఈ సోషల్ మీడియా ప్రచారంపై ఇప్పటివరకు సానియా మీర్జా గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
సానియా మీర్జా రెండో పెళ్లికి సంబంధించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఓ టాలీవుడ్ హీరోనూ సానియా మీర్జా పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా భారత క్రికెటర్ మహ్మద్ షమీని సానియా పెళ్లాడనున్నారనే వార్తలు హల్‌ఛల్ చేశాయి. 
 
ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని.. సానియా తన కొడుకు సమక్షంలోనే షమీని పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను సానియా కొట్టిపారేసారు.  
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్ల అరుదైన మైలురాయిని అందుకున్న రిషబ్ పంత్