శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:47 IST)

టోక్యో ఒలింపిక్స్ : రెజ్లర్ సీమా బిస్లా ఓటమి

టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా, రెజ్లింగ్‌లో మహిళలు మరోమారు నిరాశపరిచారు. 50 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో సీమా బిస్లా ఓటమి పాలయ్యారు. ట్యునీషియాకు చెందిన హమ్దీ సర్రా 3-1 తేడాతో ఆమెను ఓడించింది. మ్యాచులో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 
 
మొదటి పిరియడ్‌లో సీమకు పాయింట్లేమీ రాలేదు. ప్రత్యర్థి సైతం ఒక పాయింటే అందుకుంది. ఇక రెండో పిరియడ్‌లో ఇద్దరూ ఉండుం పట్టు పట్టారు. సీమకు ఒక పాయింటు లభించింది. అయితే ప్రత్యర్థికి మరో 2 పాయింట్లు రావడంతో భారత రెజ్లర్‌కు ఓటమి తప్పలేదు. దీంతో రెజ్లింగ్‌లో భారత మహిళలు మరోమారు నిరాశపరిచారు.