శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (18:31 IST)

ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టి తప్పుచేశా.. బేబీ పుట్టాకే టెన్నిస్ ఆడుతా: సెరెనా

రెడిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌తో ప్రపంచ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సహజీవనం చేస్తోంది. అలెక్సిస్‌తో సహజీవనానికి గుర్తుగా త్వరలో తనకు అమ్మతనం లభించనుందని... తాను 20వారాల గర్భవతిని అని సెరెనా ఇటీవ

రెడిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌తో ప్రపంచ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సహజీవనం చేస్తోంది. అలెక్సిస్‌తో సహజీవనానికి గుర్తుగా త్వరలో తనకు అమ్మతనం లభించనుందని... తాను 20వారాల గర్భవతిని అని సెరెనా ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాను గర్భవతిని అనే విషయాన్ని ఎందుకు బహిర్గతం చేసివుండకూడదంటోంది. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పొరపాటున బయటపెట్టానని చెప్తోంది. 
 
గర్భవతి అనే విషయం బయటికి తెలిస్తే.. లేనిపోని కథనాలు రాస్తారని.. అందుకే బయటపెట్టాల్సి వచ్చిందని సెరెనా వివరించింది. కానీ ఆస్ట్రేలియా ఓపెన్ ఆడినప్పుడు తాను గర్భవతిని అనే విషయం ఆలోచించలేదని.. టోర్నీ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని చెప్పుకొచ్చింది. అమ్మతనం అనేలో జీవితంలో ఓ భాగమేనని.. బేబీ పుట్టిన తర్వాత మైదానంలో ఆడుతానని సెరెనా వెల్లడించింది. 
 
తన బిడ్డ తాను టెన్నిస్ ఆడుతుంటే.. బేబీ స్టాండ్‌లో నిలబడి.. తన గేమ్‌ని చూస్తూ చప్పట్లు కొట్టాలని సెరెనా తెలిపింది. అప్పుడప్పుడు తనను తాను ఫోటోలు తీసుకుని చూసుకోవడం అలవాటని.. అలా గర్భవతిగా ఉన్న ఫోటోలను యాదృఛ్చికంగా బయటపెట్టేయాల్సి వచ్చిందని సెరెనా వెల్లడించింది.