శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (15:30 IST)

ప్రొకబడ్డీ లీగ్ : పవన్ సెహ్రాత్‌ను సొంతం చేసుకున్న తెలుగు టైటాన్స్

pawan sehran
ప్రొకబడ్డీ లీగ్ టోర్నీ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ దఫా తెలుగు టైటాన్స్ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్‌లో తమిళ్ తలైవాస్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాడు పవన్ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్ సొంతం చేసుకుంది. 
 
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10 కోసం జరుగుతున్న వేలంలో అతడిని ₹ 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఫలితంగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇరాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రెజాను పుణెరి పల్టాన్ ₹ 2.35 కోట్లకు దక్కించుకుంది. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాళ్ల జాబితాలో రెజా చోటు సంపాదించాడు. డిసెంబరు 2న ప్రొకబడ్డీ లీగ్ సీజన్-10 ప్రారంభం అవుతుంది.
 
ఈ వేలం పాటల్లో ఇతర ఆటగాళ్లు అమ్ముడుపోయిన ధరల వివరాలను పరిశీలిస్తే, మణీందర్ సింగ్ - బెంగాల్ వారియర్స్ (రూ. 2.12 కోట్లు), ఫజల్ - గుజరాత్ టైటాన్స్ (రూ.160 కోట్లు), సిద్ధార్ద్ దేశాయ్ - హరియాణా స్టీలర్స్ (రూ. కోటి), మీటూశర్మ - యుముంబా (రూ. 93 లక్షలు), విజయల్ మలిక్ - యూపీ యోధాస్ (రూ. 85 లక్షలు), గమాన్ - దబాంగ్ ఢిల్లీ (రూ. 85 లక్షలు), చంద్ర రంజిత్ - హరియాణా స్టీలర్స్ (రూ. 62 లక్షలు), రోహిత్ గులియా - గుజరాత్ టైటాన్స్ (రూ. 58.50 లక్షలు), వికాస్ - బెంగళూరు బుల్స్ (రూ. 55.25 లక్షలు) అధిక ధరకు అమ్ముడుపోయారు.