శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (16:16 IST)

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ... ఛెత్రి ట్వీట్‌పై కేటీఆర్ స్పందన

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ స్టేడియాలకు వచ్చి మా మ్యాచ్‌లను వీక్షించండి అంటూ ఒక ఆవేదన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ స్టేడియాలకు వచ్చి మా మ్యాచ్‌లను వీక్షించండి అంటూ ఒక ఆవేదన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
 
ఛెత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. నేను త్వరలోనే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నాను. మరి మీ సంగతేంటి? అని తనను ట్విట్టర్లో అనుసరించే సభ్యులను ప్రశ్నించారు. దయచేసి ఛెత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేయండి. ప్రపంచ వ్యాప్తంగా అతని సందేశాన్ని అందరికీ చేరవేయండి అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 
 
కాగా, శుక్రవారం మొదలైన నాలుగుదేశాల టోర్నీలో భాగంగా చైనీస్‌తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో గెలిచింది. ముంబైలోని ఎరీనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు 2000 మంది మాత్రమే హాజరు కావడంతో స్టేడియం బోసిబోయి కనిపించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఛెత్రి హ్యాట్రిక్ సాధించినా ప్రేక్షకులు స్టేడియంలో లేకపోవడంతో అతనిలో సంతోషం కనిపించలేదు.
 
అందుకే ఛెత్రి ట్విట్టర్‌లో తన ఆవేదనను వ్యక్తంచేశాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌లను ఆదరించడంలో తప్పులేదని.. వారి ఆటతీరులో మేం సగమైనా ఆడకపోయినా మమ్మల్నీ ప్రోత్సహించాలని కోరాడు. ఇప్పటికే 97వ ర్యాంకుతో ఆటలో మెరుగవుతున్నామని.. యువ ఆటగాళ్లు రాణిస్తున్న సందర్భంలో ప్రేక్షకుల మద్దతు దొరికితే మరింతగా విజయవంతమవుతామని ఛెత్రి విశ్వాసం వ్యక్తంచేశాడు.