శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:10 IST)

స్విజ్ మాస్టర్ ఓడిపోయాడా? అదీ అన్‌సీడెడ్ ప్లేయర్ చేతిలోనా?

స్విజ్ మాస్టర్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చుక్కెదురైంది. అదీ అన్ సీడెడ్ ఆటగాడి చేతిలో రోజర్ ఫెదరర్ ఓడిపోయాడు. ఐదుసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన రోజర్ ఫెదరర్.. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపె

స్విజ్ మాస్టర్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చుక్కెదురైంది. అదీ అన్ సీడెడ్ ఆటగాడి చేతిలో రోజర్ ఫెదరర్ ఓడిపోయాడు. ఐదుసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన రోజర్ ఫెదరర్.. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో ఖంగుతిన్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో రోజర్ ఫెదరర్ పరాజయం పాలయ్యాడు. 
 
ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ మిల్‌మాన్ స్విజ్ మాస్టర్‌ ఫెదరర్‌ను నాలుగు సెట్లు సాగిన మ్యాచ్‌లో ఓడించి సరికొత్త స్టార్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 3-6 తేడాతో కైవసం చేసుకున్న ఫెదరర్, ఆపై మి‌ల్‌మాన్ ధాటికి చేతులెత్తేశాడు. వరుసగా మూడు సెట్లను 7-5-, 7-6, 7-6 తేడాతో మిల్ మాన్ గెలిచాడు. 
 
ఫలితంగా ప్రీ-క్వార్టర్స్‌లో విజేతగా నిలిచాడు. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌లో మిల్‌మాన్, నోవాక్‌ జకోవిచ్‌‌తో బరిలోకి దిగనున్నాడు. నోవాక్ జకోవిచ్‌తోనూ మిల్‌మాన్ మెరుగ్గా రాణించగలడని.. కానీ అతని నుంచి గట్టిపోటీ ఎదుర్కోవలసి వుంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.