ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా బుధవారం రాత్రి జరగాల్సిన 50 కేజీల మహిళ రెజ్లింగ్ ఫైనల్ పోటీలో తలపడాల్సిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఆమె నిర్ణీత 50 కేజీల బరువు కంటే అదనంగా 100 గ్రాముల బరువు పెరిగారు. బుధారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ కోసం బుధవారం ఉదయం ఆమె బరువును ఒలింపిక్స్ నిర్వాహుకులు పరిశీలించారు. ఆ సమయమంలో ఆమె 100 గ్రాముల అదనపు బరువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేసింది.