మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (17:15 IST)

నా భర్త ఒక గే.. అతనికి పురుషులంటేనే అమితమైన ఇష్టం : స్వీటీ బూరా

sweety boora
క్రికెటర్ దీపక్ హుడాపై అంతర్జాతీయ బాక్సర్, మాజీ ప్రపంచ చాంపియన్ స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త ఒక గే అని, అతనికి పురుషులంటేనే అమితమైన ఇష్టమని పేర్కొంది. భర్త దీపక్‍‌ను గల్లా పట్టుకుని స్వీటీ బూరా దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో ఆమె ఘాటుగా స్పందించారు. తనను కావాలనే చెడుగా చూపిస్తున్నారని, వాస్తవానికి దీపక్ హుడానే తనను గృహహింసకు గురిచేశాడని ఆరోపించారు. 
 
వైరల్ అవుతున్న వీడియోలో ముఖ్యమైన భాగాలు తొలగించారని, దీపక్ హుడా తనను దూషించిన ప్రారంభ, ముగింపు  సన్నివేశాలు కూడా లేవని తెలిపారు. ఈ సంఘటన సమయంలో తనకు పానిక్ అటాక్ వచ్చిందని, ఆ భాగాన్ని కూడా కట్ చేశారని చెప్పారు. హిస్సార్ ఎస్పీ కూడా దీపక్ హుడాకు మద్దతు తెలుపుతున్నారని పోలీస్ స్టేషన్‌‍లో జరిగిన సన్నివేశాల వీడియోను బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
పైగా, తన భర్త ఒక గే అని, అతనికి పురుషులంటేనే ఇష్టమని ఆరోపించారు. కాగా, తన భర్త దీపక్‌పై స్వీటీ బూరా వరకట్న వేధింపుల కేసు పెట్టారు. దీంతో మార్చి 15వ తేదీన కౌన్సెలింగ్ కోసం ఎదురెదురుగా కూర్చోబెట్టారు. అయితే, వారి మధ్య వివాదం తలెత్తడంతో స్వీటీ బూరా దీపక్ హుడా చొక్కా పట్టుకుని దాడి చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో మార్చి 24వ తేదీన వైరల్ అయిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె గురువారం ఆన్‌లైన్‌లో స్పందించారు.