శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (15:58 IST)

బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు కాంస్య పతకం

రష్యాలోని ఉలాన్ ఉదెలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మేరీకోమ్ ఇప్పుడు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ కేరిరోగ్లు చేతిలో 51 కిలోల విభాగంలో 1-4 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. 
 
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్ 5-0 తేడాతో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థిని చిత్తు చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే, ఇదే ఛాంపియన్ షిప్‌లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు.