శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 జులై 2023 (22:21 IST)

బాదం టీ తాగితే రోజంతా ఎనర్జీ, ఎలా తయారు చేయాలి?

Almonds
ఉదయం వేళ చాలామంది కాఫీ, టీ వంటివి సేవిస్తుంటారు. ఐతే కొందరు టీని రకరకాలుగా చేసుకుని తాగుతుంటారు. వీటిలో బాదం టీ ఒకటి. ఈ టీ తాగితే రోజంతా ఎనర్జీతో వుంటారని చెపుతారు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. బాదం టీ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఇవే.
టీ పొడి, బాదం పప్పులు, పాలు, నిమ్మరసం, చక్కెర.
 
బాదం టీని తయారు చేసేందుకు కావలసిన మోతాదులో మంచినీటిని పాత్రలో పోయాలి. ఆ నీటిని స్టౌపై పెట్టి నీటిలో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి మరిగించాలి. ఆపై టీ పొడి, పాలు పోసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత అందులో చక్కెర, తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి.
ఈ టీ తీసుకోవడం వలన తలనొప్పి తగ్గడమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు.