అటుకుల కొబ్బరి లడ్డూ ఎలా తయారు చేస్తారు?
కావలసిన పదార్థాలు :
అటుకులు - రెండు కప్పులు,
పచ్చికొబ్బరి - ఒక చిప్ప,
యాలకులు - చెంచా,
బెల్లం - రెండు కప్పులు,
కిస్‌మిస్ - రెండు టీస్పూన్లు,
పాలు - అరకప్పు,
జీడిపప్పు - టీస్పూన్,
నెయ్యి - వేయించడానికి సరిపడ.
తయారు చేయు విధానం :
ముందుగా అటుకులను శుభ్రంగా ఏరి వాటిని మిక్సీలో వేసి కాస్త గరుకుగా పట్టుకోవాలి. తర్వాత కొబ్బరిని, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో దోరగా వేయించాలి. తర్వాత పాలను గిన్నెలో వేడిచేసి అందులో తురిమిపెట్టుకున్న బెల్లాన్ని వేసి కలపాలి.
బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి తర్వాత పాలను అటుకుల మిశ్రమంలో వేసి కలిపి వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చుట్టాలి. వీటిపై మెల్లగా జీడిపప్పు, కిస్‌మిస్‌లను అద్దాలి. అంతే కొబ్బరి లడ్డూ రెడీ. వేడిగా సర్వ్ చేయండి.