ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (15:46 IST)

రాఖీ స్పెషల్ : రైస్ ఖీర్ ఎలా చేయాలో తెలుసా?

శ్రావణ మాసంలో పండుగలు వరుసపెట్టి వస్తుంటాయి. అలాంటి పండుగల్లో ఒకటి రాఖీ పూర్ణిమ. ఉత్తరాది పండగైనప్పటికీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకోబడుతున్న ఈ పండుగలో రాఖీ దారాలకు తోడు స్వీట్లు తప్పకు

శ్రావణ మాసంలో పండుగలు వరుసపెట్టి వస్తుంటాయి. అలాంటి పండుగల్లో ఒకటి రాఖీ పూర్ణిమ. ఉత్తరాది పండగైనప్పటికీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకోబడుతున్న ఈ పండుగలో రాఖీ దారాలకు తోడు స్వీట్లు తప్పకుండా ఉండాల్సిందే. ఉత్తరాదిన రాఖీ పండుగ రోజున బాదంతో చేసిన స్పెషల్ స్వీట్లను అన్నయ్య రాఖీ కట్టేటప్పుడు తినిపించడంతో పాటు ఇరుగుపొరుగు వారికి ఇస్తుంటారు. అలాంటి స్వీట్లలో ఒకటి రైస్ ఖీర్. 
 
రైస్ ఖీర్ ఎలా చేయాలంటే.. 
కావలసిన పదార్థాలు
బాస్మతి రైస్ - ఒక కప్పు 
పాలు - ఆరు కప్పులు
యాలకుల పొడి - ఒక టీ స్పూన్ 
బాదం పప్పు - పావు కప్పు 
కుంకుమ పువ్వు - కొద్దిగా 
పిస్తా పొడి - పావు కప్పు, 
పంచదార - తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు తీసుకోవాలి. అందులో కుంకుమ వేసి నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. మరో పెద్ద గిన్నెలో పాలు కాగబెట్టాలి. పాలు మరిగిన తర్వాత బియ్యం వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు బాదం, పిస్తా, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద మరో ఐదు నిమిషాలు ఉంచాలి. చివరగా చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత దించేయాలి. ఇప్పుడు ఈ ఖీర్‌ని ప్లేట్‌లోకి తీసుకొని కొన్ని పిస్తా, బాదం పొడిని చేర్చి మరి కొన్ని బాదం, పిస్తా పప్పుల ముక్కలతో గార్నిష్ చేసుకుంటే రైస్ ఖీర్ రెడీ అయినట్లే.