సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (16:23 IST)

సెక్షన్ 49పి అంటే? టెండర్ ఓటును ఎపుడు లెక్కిస్తారు?

తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "సర్కార్". ఈ చిత్రం ఓటు విలువను తెలిపింది. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అయితే, ఎన్నికల సంఘంలోని సెక్షన్ 49పి ప్రకారం మన ఓటు ఎవరో వేస్తే హక్కుగా దీన్ని తిరిగి పొందాల్సిన బాధ్యతను ఈ చిత్రం గుర్తుచేసింది. 
 
ఫలితంగా ప్రస్తుతం సెక్షన్ 49పి పై విస్తృత చర్చసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రస్తుతం రాజకీయాలు ఈ సెక్షన్ చుట్టూత తిరుగుతున్నాయి. తన ఓటును ఎవరైనా వేస్తే తిరిగి దక్కించుకోవడం ఎలా అన్నదానిపై అనేక మంది చర్చించుకుంటున్నారు. 
 
భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49పి ప్రకారం తన ఓటును ఎవరో వేస్తే తిరిగి పొందేందుకు కల్పించిన చట్టం ఇది. కోల్పోయిన ఓటును పొందాలనుకునేవారు.. తానే అసలు ఓటరునని ఎన్నికల అధికారి (సంబంధిత బూత్ ప్రిసైడింగ్ అధికారి) ముందు నిరూపించుకోవాలి. 
 
ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు ఇతర ఆధారాలను సమర్పించి అధికారి వద్ద ఉండే 17(బి) ఫామ్ పూర్తి చేసి సంతకం చేసి అందజేయాలి. అపుడు అధికారి టెండర్ బ్యాలెట్ పేపరును మనకిస్తే దీనిపై ఓటు వేయాలి. దీనిని ఒక ప్రత్యేక కవరులో ఉంచి లెక్కింపు కేంద్రానికి పంపిస్తారు. అయితే, దీనిని అరుదైన సమయంలోనే లెక్కిస్తారు. అభ్యర్థి విజయంపై దీనిపై ఆధారపడి ఉంటేనే లెక్కిస్తారు. దీన్నే ఇపుడు మనం పిలుస్తున్న టెండర్ ఓటు.