గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (09:48 IST)

టీఆర్ఎస్ నేతలే డబ్బు పంచి ఓడించారు.. ఐదేళ్ళు విశ్రాంతి : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ అసెంబ్లీ స్థానంలో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి కృష్ణారావు ఓడిపోయారు. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు ప్రభంజనం సృష్టిస్తే కొన్ని స్థానాల్లో మాత్రం తెరాస అభ్యర్థులు ఓడిపోయారు. వీరిలో నలుగురు మంత్రులు, స్పీకర్ మధుసూధనాచారిలు ఉన్నారు. ఓడిన మంత్రుల్లో జూపల్లి కృష్ణారావు ఒకరు. 
 
ఈయన తన ఓటమిపై స్పందించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయించారని.. అందుకే ఓడిపోయానని ఆరోపించారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ లేదని.. ఐదేళ్లూ విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఐదుసార్లు తనను ఆశీర్వదించిన కొల్లాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. 
 
కొల్లాపుర్‌కు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలైనప్పటికీ.. టీఆర్‌ఎస్‌ నేతలే విచ్చలవిడిగా డబ్బులు పంచి తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయించారని జూపల్లి ఆరోపించారు. కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి కారణమయ్యాయని చెప్పారు. ఈ సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగినట్టయితే కేసీఆర్‌కు తిరుగులేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.