మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (09:18 IST)

సచివాలయం తరలింపు... కేసీఆర్‌పై మోత్కుపల్లి ఆగ్రహం...!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం తరలింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ నియంత దోరణికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. 
 
ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో కలిసి ఆయన చెస్ట్ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ ‘‘సచివాలయాన్ని ఛాతీ ఆసుపత్రికి తరలించి ఆకాశమెత్తు భవనాలు నిర్మిస్తాడట. ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ పంపిస్తాడట. నీ ఇష్టమొచ్చినట్లు చేయడానికి తెలంగాణ నీ అయ్య జాగీరు కాదు’’ అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.