సంబంధిత వార్తలు
- కేసీఆర్‌కి చంద్రబాబు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే!!?
- తాను పడిన కష్టాల కంటే... ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదులే : మాజీ సీఎం కేసీఆర్
- బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??
- మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!
- మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే (Video)
బీఆర్ఎస్‌కి బిగ్ షాక్, మరో వికెట్ డౌన్, కేసీఆర్ 'కారు'ను హస్తం ఫినిష్ చేస్తుందా?
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసారు. మరికొద్దిసేపట్లో ఆయన సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
మహిపాల్ రెడ్డి చేరికతో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 10కి చేరుకుంది. దీనితో సభలో 29 సభ్యులు బలం వున్న భారాస బలం 19కి పడిపోయింది. మరో పది మంది భారాస ఎమ్మెల్యేలను పార్టీ నుంచి లాగేస్తే కారు ఖతం అయిపోతుంది. భారాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పార్టీని వీడి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడంలేదు. ఈ వలసలు ఇలాగే సాగితే తెలంగాణలో కారు కనుమరుగు అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ ఉపద్రవాన్ని భారాస అధినేత కేసీఆర్ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే.
