శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (20:25 IST)

పెళ్లి విందులో మటన్ ముక్క కోసం తలలు పగులకొట్టుకున్నారు..

Mutton Piece
తెలంగాణలోని నందిపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి విందులో మటన్ ముక్క తక్కువైందని.. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. వధూవరుల తరపు బంధువులు.. మటన్ కోసం వాగ్వాదానికి దిగారు. ఇది కాస్త ఒక లిమిట్ దాటింది. 
 
అంతేకాకుండా.. అది కాస్త కొట్టుకోవడం వరకు వెళ్లింది. దీంతో మటన్ కోసం కర్రలతో తలపగులకొట్టుకున్నారు. దీంతో పచ్చని పెళ్లి కాస్త రణరంగంగా మారింది. అక్కడ కొంత మంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది.