గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2023 (14:28 IST)

రూ.500 గ్యాస్ సిలిండర్ : ఆ రోజు నుంచే ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్

gas cylinder boy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. రూ.500కే సిలిండర్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ రూ.500 ఇచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం 100 రోజుల గడువు పడుతుందని తేల్చి చెప్పారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అత్యంత ప్రధానమైనది రూ.500 వంట గ్యాస్ సిలిండర్ పథకం. ఈ పథకం అమలుపై ఇప్పటికే ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి అమలవుతుంది. గ్యాస్ సిలిండర్ రూ.500కే పాదాలంటే ఏం చేశాలనే డౌట్స్ వస్తున్నాయి. ఇదేసమయంలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖపై జరిపారు. 
 
అయితే, గ్యాస్ సిలిండజర్ రూ.500 రూపాయలకు ఇచ్చే అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం 100 రోజుల గడువు పడుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పౌసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్న మంత్రి ఈ నష్టానికి గత పాలకుల తప్పిదాలే కారణమని విమర్శించారు. 
 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తారన్న ఆరు గ్యారెంట్లీల్లో ఒక మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు. రెండో పథకం 500 రూపాయల గ్యాస్ సిలండర్ పథకం. ఈ స్కీమ్ అమలు కోసం సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.