సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (11:21 IST)

హైదరాబాద్ ఐఐసీటీలో ఉద్యోగ అవకాశాలు

Jobs
హైదరాబాద్ నగరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) హైదరాబాద్ నగరంలో తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ నగరంలోని సీఎస్ఐఆర్ ఐఐసీటీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. రెండు విభాగాల్లో మొత్తం 26 పోస్టుల భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 
 
సీఎస్ఐఆర్ ఐఐసీటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హతలకు సంబంధించిన కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించింది. మెట్రిక్ లేదా పదో తరగతి, ఇంటర్, పీజీ, నెట్ లేదా గేట్ తదితర సర్టిఫికేట్లు, కేటగిరీ, కులం వారీగా రిజర్వేషన్ సర్టిఫికేట్‌తో రావాలని కోరింది. 
 
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికేట్లతో రావాలని కోరింది. ఇక వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.