మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్!!

bhatti vikramarka
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. శాసనమండలిలో రాష్ట్ర ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. 
 
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా, శనివారం ఉందయం 9 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపింది. 
 
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు వీలుగా వచ్చే రెండు నెలల కోసం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 


గ్రూపు-1 పరీక్షలకు గరిష్ట వయోపరిమితి పెంపు!! 
 
తెలంగాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూపు-1 పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు వయో పరిమితిని గరిష్టంగా 46 యేళ్లకు పెంచనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్ని నిబంధనల కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నియమించాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.
 
అలాగే, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. నలుగురు ఉద్యోగాలు ఊడిపోయిన దుఃఖంలో ఉన్న విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని భారత రాష్ట్ర సమితి నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలను విక్రయించబోదన్నారు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకోబోదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.