సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (09:43 IST)

నేడు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. యేడాదిలో రెండోసారి...

Exam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. టెట్ పరీక్ష నిర్వహణ కోసం మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. యేడాదికి రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు సోమవారం రెండో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షకు 2.35 లక్షల మంది హాజరయ్యారు. తాజాగా విడుదల చేయనున్న టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన రాత పరీక్ష వచ్చే యేడాది జనవరి నెలలో ఉండే అవకాశం ఉంది. టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసినవారు అర్హులు. 
 
ఈ యేడాది రెండోసారి నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ లోపా లేదా సంక్రాంతి తర్వాత నిర్వహించాలా అనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పరీక్షల కోసం వారం, పది రోజుల పాటు స్లాట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవి దొరికే సౌలభ్యాన్నిబట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 
 
మే నెలలో నిర్వహించిన 2.35 లక్షల మంది హాజరుకాగా 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ పరీక్షను నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. నలుగురు మృతి 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నలుగురు యువకు మృత్యువాతపడ్డారు. మృతులను కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్లెక్సీలు కడుతుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 
 
ప్లెక్సీలు కడుపుతున్న సమయంలోపైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు అనే వారిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని ఉండ్రాజవరం పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.