మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2023 (14:24 IST)

జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

telangana govt
కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా, డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి నుంచి జరుపుకునేందుకు అనుమతించింది. ఆ రోజున పబ్‌లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్ళు రాత్రి ఒంటి గంట వరకు తెరిచివుంచేందుకు అనుమతించింది. అయితే, ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
 
ఈ క్రమలో జనవరి ఒకటో తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి ఒకటో తేదీన హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండో శవివారం సెలవును రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు, పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.