ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో చిన్నపాటి అపశృతి చోటుచేసుకుంది. సోమవారం నిజామాబాద్‌లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులు హెలికాఫ్టరులో బయలుదేరారు. అయితే, అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన విమానం కాస్త సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరాణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమై పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడిన దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు.
ఈ హెలికాఫ్టరులో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హెలికాఫ్టరులో హాజరువుతున్నట్టుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. హెలికాఫ్టరులో ల్యాండింగ్ కోసం కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ విషయంలో అధికారుల సమన్వయలోపం కారణంగా హెలికాఫ్టర్‌ను సభా ప్రాంగణంలోనే పైలెట్ దించేశాడు.
హెలికాఫ్టర్ రెక్కలు నుంచి గాలి కారణంగా భారీ దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలోని జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. అదేవిధంగా మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి.