ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

రెమాల్ తుఫాను ఎఫెక్టు : తెలంగాణాకు ఎల్లో అలెర్ట్ జారీ

rain
రెమాల్ తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. దీంతో ఆ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవచ్చని తెలిసిన వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రెమాల్ ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాడు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవచ్చని వెల్లడించింది. 
 
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ తెలంగాణాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రెమాల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఏపీలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ, ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతుంది. ఇందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నారు. పోలింగ్ రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే, రాష్ట్రంలో 114 సెక్షన్ అమలు చేస్తున్నట్టు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. 
 
రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలలో అదనపు బలగాలను మొహరించనున్నట్టు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కుట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించి డ్రైడేగా అమలు చేయనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున భద్రత కల్పించేందుకు వీలుగా రాష్ట్రానికి అదనంగా మరో 20  కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని తెలిపారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు. 
 
పపువా న్యూగినీలో కొండ చరియల కింద 2 వేల మంది సజీవ సమాధి!! 
 
పవువా న్యూగినియా దేశంలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 2 వేల మంది గిరిజన ప్రజలు సజీవ సమాధి అయినట్టు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ ప్రాంతమంతా భౌగోళిక అస్థిరత్వం ఉండటం, సమీపంలో గిరిజనుల ఘర్షణలు జరుగుతున్న కారణంగా సహాయకచర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వెల్లడించింది. అందువల్ల మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఎంగా ప్రావిన్స్‌లోని ఎంబాలి గ్రామంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల కింద చిక్కుకుని 670 మంది మృతి చెందినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అయితే, మృతుల సంఖ్య 2 వేలు దాటిందని స్థానిక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ యూఎన్కు లేఖ రాసింది. అనేక భవంతులు, వనాలు నాశనమయ్యాయని పేర్కొంది.
 
విపత్తు సంభవించిన ప్రాంతంలో సుమారు 4 వేల మంది ఉంటున్నారు. అయితే, స్థానిక జనాభా ఎంతనేది ఖచ్చితంగా చెప్పడటం కష్టమని అక్కడి అధికారులు అంటున్నారు. చివరి సారి జనాభా లెక్కలను 2000లో తీసుకున్నారని తెలిపారు. ఈ యేడాది మరోసారి జనగణన నిర్వహించనున్నట్టు అక్కడి ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
 
ఘటన జరిగిన ప్రాంతంలో భౌగోళిక అస్థిరత్వం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతం సుదూరాన ఉండటం మరో ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులే రంగంలోకి దిగి క్షతగాత్రులను వెలికి తీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పలుగు, పారలతో కొండచరియలను తవ్వుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.