ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (15:27 IST)

పచ్చిమిర్చి తిన్న చిన్నారి మృత్యువాత... ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పచ్చిమిరపకాయ తిన్న ఓ చిన్నారు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో మారుతి, కవిత అనే దంపతులకు క్రాంతికుమార్ అనే 13 యేళ్ల బాలుడు ఉన్నాడు. ఈ బాలుడికి చెత్త తినే అలవాటు ఉంది. దీంతో నేలపై పడిన చెత్త, పచ్చిమిర్చిని తిన్నాడు. ఇవి గొంతులో అడ్డంగా ఇరుక్కునిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు నీళ్లు తాగించినా ఫలితం లేకుండా పోయింది. 
 
గొంతులో అడ్డంగా పడటంతో ఊపిరాడకపోవడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా ఆడుకుంటూ వచ్చిన కుమారుడు... కొన్ని క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 
 
భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఎక్కడ?  
 
ఒరిస్సా రాష్ట్రంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సోన్పూర్‌ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ అనే వ్యక్తి మూడేళ్ళ క్రితం అనుగుల్ అనే ప్రాంతానికి చెందిన జిల్లి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, ఆమెకు అప్పటికే ఓ ప్రియుడు ఉన్నాడు. జిల్లి దూరపు బంధువైన పరమేశ్వరతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో గురువారం అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై మాధవ ప్రధాన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు గాలించి ఇద్దరిని ఠాణాకు తీసుకొచ్చారు. జిల్లిని ఠాణా అధికారి ప్రశ్నించగా పరమేశ్వర్ ప్రధాన్‌తో ఉంటానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విషయం మాధవ ప్రధాన్‌కు వివరించారు. మాధవ అంగీకారంతో ఆయన సమక్షంలోనే శనివారం రాత్రి వారిద్దరికి ఠాణాలో వివాహం చేశారు.