శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (17:53 IST)

మినీ మేడారం జాతర.. ముగ్గురు సిబ్బందికి కోవిడ్.. కొందరిలో కరోనా లక్షణాలు

మినీ మేడారం జాతరకు వెళ్లి వచ్చారా.. అయితే ఒకసారి కరోనా టెస్టులు చేయించుకోవడం మంచిది. ఎందుకు అనుకుంటున్నారా.. మేడారం మినీ జాతరలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ముగ్గురు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరికొంత మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో.. వారిని క్వారంటైన్‌లో ఉంచాలని అధికారులు సూచించారు. 
 
మరోవైపు, కరోనా కేసులతో అప్రమత్తమైన అధికారులు.. భక్తుల రక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్నారు. మేడారం జాతర తరహాలో కాకపోయినా.. మినీ జాతరకు కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇదే సమయంలో సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో.. వారిని హోం ఐసోలేషన్‌లో పెట్టారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.