శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (20:23 IST)

హైదరాబాద్‌లో అమానుషం.. 16మంది చిన్నారులను బట్టలూడదీసి..

హైదరాబాద్‌లో అమానుషం జరిగింది. 16 మంది చిన్నారులపై విచాక్షణారహితంగా దాడి చేశారు. చిన్నారుల దుస్తులు ఊడదీసి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. దీంతో చిన్నారులు గాయపడ్డారు. ఇదంతా మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ కేసు విచారణలో ఉందని సీఐ రవి పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 16 మంది చిన్నారులపై దాడి చేశారు. ఎందుకు దాడి చేశారనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.