ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 మార్చి 2020 (17:22 IST)

శరీరంపై దుస్తులు లేవు, ముఖం ఛిద్రం, బ్రిడ్జి కింద మహిళ శవం

సంచలనం సృష్టించిన దిశ దారుణ ఘటన మరువక ముందే అలాంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని తంగడపల్లి బ్రిడ్జి కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి వుండటం కలకలం రేపింది. మృతురాలి శరీరం పైన దుస్తులు లేవు, ఆమె ముఖం గుర్తించకుండా వుండేందుకు దుండగులు బండరాయితో మోదారు. దీంతో ఛిద్రమైన స్థితిలో ముఖం వున్నది. ఆమె చేతికి బంగారు గాజులు, మెడలో బంగారు చైన్ వుంది. 
 
మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఇక్కడకి తీసుకుని వచ్చి పడవేసి వుండివుంటారని పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. నిందితులకు సంబంధించిన ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. మృతురాలిని వంతెన కిందికి తాడు సాయంతో కిందికి దించారు. ఆ తాడు మాత్రమే శవానికి కొంతదూరంలో పడి వుంది. 
 
మహిళ హత్య మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగినట్లుగా భావిస్తున్నారు. కాగా పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం వుంది.